హైదరాబాద్ నగరంలో కనిపించని లాక్‌డౌన్.. ట్రాఫిక్ రూల్స్ బేఖాతర్. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

హైదరాబాద్ నగరంలో కనిపించని లాక్‌డౌన్.. ట్రాఫిక్ రూల్స్ బేఖాతర్.


శుభ తెలంగాణ (08, మే , 2020 - హైదరాబాద్ ) : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో దీని  కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం  లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే నగరంలో లాక్‌డౌన్ వాతావరణం కనిపించడంలేదు. ప్రధాన సెంటర్లలో గ్రీన్,ఆరెంజ్  ఓ వైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే నగరంలో లాక్‌డౌన్ వాతావరణం కనిపించడంలేదు. ప్రధాన సెంటర్లలో గ్రీన్,ఆరెంజ్ జోన్ల నిబంధనలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాగా.. చాలా చోట్ల లాక్‌డౌన్ నిబంధనలను, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించి వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారు.  ప్రధాన కూడలి అయిన కూకట్‌పల్లి జెఎన్‌టియు వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు రూల్స్ ని బేఖాతరు చేస్తుండడంపై పోలీసుల ఆగ్రహంతో ఉన్నారు. 2రోజుల వ్యవదిలోనే 20కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.  రోజుకి 2 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి.

Post Top Ad