అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాను విచారించడంతో పోలీసుల హస్తం బయటపడింది. దీంతో డీజిల్ అక్రమ దందాకు సహకరిస్తున్న ఆరుగురి పోలీసులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్, మేడిపల్లి పీఎస్కు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.