ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ ఎల్లమ్మ చెరువు వద్ద దోమల నివారణకు చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ ఎల్లమ్మ చెరువు వద్ద దోమల నివారణకు చర్యలు


శుభ తెలంగాణ (20, మే , 2020) : కూకట్పల్లి, ఎల్లంబండ, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ ఎల్లమ్మ చెరువు ప్రాంతానికి దగ్గరలో ఉన్న కాలనీలలో దోమల సమస్య ఎక్కువ కావడంతో స్థానికులు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కు ఈ విషయాన్ని తెలియజేయగా శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ మాట్లాడి... ఎంటమాలజీ సిబ్బంది ద్వారా ఆధునికమైన డ్రోన్ స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా చెరువులో కెమికల్ స్పై పిచికారి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... కెమికల ప్పే ద్వారా చెరువులో ఉన్న దోమల గుడ్లను నశింపజేసి దోమలను అరికట్టవచ్చు అని, రాబోయేది వర్షాకాలం కనుక దోమల నివారణకు ముందస్తు చర్యలు ఎంటమాలజీ సిబ్బంది సహకారంతో చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కాశీనాధ్ యాదవ్, నాయకులు బోయ కిషన్, ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్, గుడ్ల శ్రీనివాస్, ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహులు సిబ్బంది పాల్గొన్నారు.

Post Top Ad