లక్డౌన్ వేల రోడ్డెక్కిన వాహనాలు : రూల్స్ పాలో అవుతున్నామన్న వాహనదారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

లక్డౌన్ వేల రోడ్డెక్కిన వాహనాలు : రూల్స్ పాలో అవుతున్నామన్న వాహనదారులు


తెలంగాణ : హైదరాబాద్ లో దాదాపు 45 రోజు తర్వాత వాహనాలు  భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపు ఇవ్వడంతో ఆయా రంగాకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగు సైతం 33 శాతం మంది కార్యాయాకు వెళ్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు  సైతం తెరచుకుంటున్నాయి. ఎక్ట్రికల్‌, ప్లంబర్‌, సిమెంట్‌, స్టీల్‌ దుకాణాు తెరవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగు, వ్యాపాయి ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో సాధారణ రోజుతో పోలిస్తే 35 శాతం వాహనాు రహదారుపై తిరుగుతున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాు సైతం తెరుచుకోవడంతో నగర రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిరోజుల్లో రోడ్లపై వాహనాు చాలా తక్కువ సంఖ్యలో కనిపించాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపుతో గత రెండు రోజు నుంచి నగరంలో వాహనా రాకపోక సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోలీసు మాత్రం వెసుబాటు కల్పించిన రంగానికి  చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వాహనదారుపై చర్యు తీసుకుంటున్నారు.

Post Top Ad