దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ పై అవగాహ నసదస్సు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ పై అవగాహ నసదస్సు

లింగోజిగూడ డివిజన్లోని వివిధ కాలనీలలో రాబోయే
వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణపై లింగోజీ గూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎల్.బీ.నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా

రాష్ట్రం లోని ప్రజలు అధికారులు మున్సిపల్ సిబ్బంది కరోనా మహమ్మారి పోరాటం చేస్తున్నారు.
రానున్న రోజుల్లో వర్షాకాలం సమయంలో దోమలు ఎక్కువగా రావడం వల్ల వివిధ ఒక కాలువ అనారోగ్య గురు రావాల్సి వస్తుంది అని ముందు జాగ్రత్త చర్యగా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రంగా మరియు అలాగే నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో మరియు ఇంటి పరిసరాల్లో హైడ్రో క్లోరైడ్ పిచికారి యంత్రాలతో ప్రతీ కాలనీని సురక్షితంగా ఉంచడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలియచేసారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 10 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాల్లో వృదా నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రపరుచుకోవాలని కోరారు.