తెలంగాణ జిల్లాలో విస్తరిస్తున్న కరోనా : కేర్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

తెలంగాణ జిల్లాలో విస్తరిస్తున్న కరోనా : కేర్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం

శుభ తెలంగాణ (08,మే , 2020 - వరంగల్ ) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 36 (వరంగల్ అర్బన్ - 27, భూపాలపల్లి -3, ములుగు - 2, జనగాం - 3, మహబూబాబాద్ - 1 , వరంగల్ రూరల్ - 0 ) కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ లో 26 , ములుగులో 2 , జనగామలో 1, భూపాలపల్లిలో 3, మహబూబాబాద్ లో 1 డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1107 కి చేరింది. బుధవారం మరో 20 మంది కొత్తగా డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 648 మంది డిశ్చార్జ్ కాగా, కరోనా కారణంగా 29 మంది మృతి చెందారు. ప్రస్తుతం 430 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అయితే గత 14 రోజుల నుంచి భూపాలపల్లి, ములుగు,మహబూబాబాద్ జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఉమ్మడి జిల్లాకు కొంచెం ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవాలి.

Post Top Ad