తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరువాలని డిసిషన్ తీసుకుంది. అయితే ఇదివరకు సరి, బేసి నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో జనాలు గుమికూడుతున్నారని అభిప్రాయపడింది. ప్రతీ రోజూ దుకాణాలు తెరిస్తే.. జనం ఉండరని భావిస్తూ.. ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి అన్ని షాపులు సాయంత్రం 6 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ మాల్స్ తెరిచేందుకు మాత్రం అనుమతివ్వలేదు.
గురువారం నుంచి హైదరాబాద్‌లో వ్యాపార దుకాణాలకు సరి, బేసి నిబంధన వర్తించదు. నిత్యావసర సరుకులు కానీ వస్తువుల కోసం జనం ఎగబడే పరిస్థితి ఉండొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉండటంతో.. వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఆయా దుకాణాల్లో ఫిజికల్ డిస్టన్స్ పాటిస్తూ, మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొన్నది. కరోనా వైరస్‌తో కలిసి పోరాడాల్సిందేనని.. అందుకోసమే ప్రభుత్వ సడలింపులు ఇస్తూ వస్తోంది. లాక్ డౌన్ 4.0 మే 31వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. దానిపై రాష్ట్రం మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్‌లో చెప్పిన తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది.