మోమిన్ పేట మండల కేంద్రంలో కార్తికేయ కంపెనీ వద్ద మే డే ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్మిక నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

మోమిన్ పేట మండల కేంద్రంలో కార్తికేయ కంపెనీ వద్ద మే డే ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్మిక నాయకులు

శుభతెలంగాణ(02మే20)వికారాబాద్ జిల్లా లోని వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రస్తుత సమయంలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూముల కృష్ణయ్య ప్రభుత్వాన్ని సూచించారు శుక్రవారం మే డే ఉత్సవాలు పురస్కరించుకొని మండల కేంద్రంలోని కార్తికేయ కర్మాగారంలో కార్మిక జెండాను ఎగురవేసి మే డే ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో జరిగిన కార్మిక పోరాటం ఫలితంగానే మే డే జరుపుకోవడం జరుగుతుందన్నారు ప్రపంచ కార్మికులారా అందరూ ఏకధాటిగా పోరాటం చేసినప్పుడే కార్మికుల ఐక్యత చాటు క ఉంటారని అన్నారు ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు అన్ని రంగాల్లో ఆదుకోవాలని ఆయన సూచించారు కార్తికేయ కంపెనీ యాజమాన్యం కూడా తమ వంతు సహకారం తో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ బాబు రవి కుమార్ మహేష్ తొలి గారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు