గాయపడిన వారిని పరామర్శించిన రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 06, 2020

గాయపడిన వారిని పరామర్శించిన రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డిశుభ తెలంగాణ (06,ఏప్రిల్,2020 - రంగారెడ్డి ) : రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఘటనలో గాయపడిన వారిని అబ్దుల్లాపూర్మెట్ లోని షాడో హాస్పిటల్లో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత మార్కెట్ అధికారులను, అలాగే ఎమ్మార్వోతో ఫోన్లో సంప్రదించి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను వారికి కల్పించాల్సిందిగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బోస్ పెళ్లి ప్రతాప్ సెన్సార్ బోర్డు నెంబరు, కరాటి శ్రీలత అనిల్ కుమార్, తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిలర్, మరిపెళ్లి అంజయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పురుషోత్తం, మండల ప్రధాన కార్యదర్శి, అంజి, సునీల్, మనోజ్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Post Top Ad