'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు పంపిణీ

కరోనా లాక్‌డౌన్  వల్ల  ' తెలుగు టెలివిజన్ పరిశ్రమ '  షూటింగ్స్ నిలిపివేసిన  సంగతి  తెలిసిందే.  ఈ తరుణంలో  షూటింగ్స్  నిలిచిపోవడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న  కొంత మంది టీవీ కళాకారులు, టెక్నిషన్స్ ను   ఆయా టీవీ  సంఘాలు, దాతలు ఇప్పటికే ఆదుకోవడం జరిగింది . ఇటీవల సినీ పరిశ్రమలోని  ఇబ్బందులను స్వయంగా  తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన   తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌ను టీవీ  పరిశ్రమ నుంచి టీవీ  ఆర్టిస్ట్ అసోసియేషన్  ప్రెసిడెంట్ వినోద్ బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, టీవీ  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్  ప్రసాద్ , కెమెరా  అసోసియేషన్ సెక్రటరీ నర్సింగ్ రావు    పలు సంఘాల నాయకులు టీవీ ఇండస్ట్రీ సమస్యలను వివరించారు. 
టీవీ  ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు సుముఖం వ్యక్తం చేసిన  మంత్రి తలసాని  తన  "తలసాని  ట్రస్ట్" ద్వారా  2 వేల మంది టీవీ  కార్మికులకు నిత్యావసర వస్తువులను   టీవీ పరిశ్రమ   పెద్దలకు  అందజేయడం  జరిగింది. ఆ  వితరణను  అన్ని సంఘాల నాయకుల సమక్షంలో  నేడు హైదరాబాద్  జూబ్లీ హిల్స్‌లో  పంపిణీ చేయడం జరిగింది. సహాయం  పొందిన  కార్మికులు మంత్రి తలసాని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీవీ  పరిశ్రమ  అభివృద్ధికి మరింత  తోడ్పాటునందించాలని టీవీ   సంఘాల  నాయకులు కోరారు.

Post Top Ad