కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం


శుభ తెలంగాణ (09, మే , 2020 - మల్కాజ్గిరి , మేడ్చల్ జిల్లా) : మల్కాజ్గిరి  మేడ్చల్ జిల్లా రెడ్ జోన్  లో ఉన్నందున  వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు  కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల  పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రక్షిత మూర్తి డిసిపి మల్కాజ్గిరి నేటి నుండి  ప్రతి ఒక్కరూ  మాస్క్ ధరించాలి మాస్క్ లేకుండా ఎవరైనా  బయట తిరిగితే వేయి రూపాయల జరిమానా  నిర్మాణ రంగ సంస్థ కు సంబంధించి  వారి వద్ద ఉన్న కూలీల తోనే నిర్మాణం చేపట్టాలన్నారు  బయటి ప్రాంతం కూలీల కు అనుమతి లేదన్నారు. 

ఐటీ రంగానికి సంబంధించి 33 శాతం ఉద్యోగస్తులు మాత్రమే విధులు నిర్వహించే విధంగా  చూసుకోవాలన్నారు.   ఉద్యోగస్తులకు వ్యక్తిగత వాహనాలు కాకుండా సంస్థ  బస్సుల ద్వారా ప్రయాణించాలి అన్నారు.  చర్లపల్లి ఇండస్ట్రియల్ కంపెనీలు తప్పకుండా ధర్మల్ స్కానర్ మాస్కులు  కార్మికులకు  సమకూర్చాలి అన్నారు.    కంపెనీలలో పనిచేసే కార్మికులు సోషల్ డిస్టెన్స్   పాటించే విధంగా చూడాలన్నారు., అలాగే వ్యాపారస్తులు ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే నిత్యావసర సరుకులు ఇవ్వకూడదా అన్నారు

సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి  వ్యాపారులు ఉద్యోగస్తులు సాయంత్రం 6 లోపు పనులు  ముగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి అన్నారు.

Post Top Ad