ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: కరీంనగర్ అదనపు పాలనాధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: కరీంనగర్ అదనపు పాలనాధికారి శ్యామ్ ప్రసాద్ లాల్

  

శుభ తెలంగాణ(౩, ఏప్రిల్ , 2020 - కరీంనగర్ ) : కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. శనివారం కరీంనగర్ లో తన ఛాంబర్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి కోతలు మమ్మురమైన దృష్ట్యా కొనుగోలు వేగాన్ని పెంచాలన్నారు. వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, కొన్ని ప్రాంతాల్లో ఆలస్య మవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయాధి కారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.