అసత్య ప్రచారంచేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటం: కీసర సిఐ నరేందర్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

అసత్య ప్రచారంచేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటం: కీసర సిఐ నరేందర్ గౌడ్

1588660985606585-0
శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - వరంగల్ ) : కరోనా వైరస్ విషయంలో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కీసర సిఐ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకని, హోమ్ క్వారంటైన్ లో ఉన్న, సాధారణ అనారోగ్యం పాలైన వారిపై వాస్తవం తెలుసుకోకుండా వారికి కరోనా ఉందని కొందరూ వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా వాట్స్ ప్ గ్రూప్స్ లో ప్రచారం చేసి బాధితులను త్రీవమనస్తాపంకు గురిచేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై గ్రూప్ పై అడ్మిన్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సి ఐ నరేందర్ గౌడ్ కోరారు.