ఎన్‌ఎఫ్‌డీబీ సీఈగా సువర్ణ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

ఎన్‌ఎఫ్‌డీబీ సీఈగా సువర్ణ

జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎన్‌ఎఫ్‌డీబీ సీఈ)గా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ సీ సువర్ణ నియమితులయ్యారు. అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆమె నియామక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. డిప్యుటేషన్‌ పద్ధతిలో మూడేండ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.

డీసీఏ జేడీగా నవీన్‌ బాధ్యతలు

రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (లైసెన్సింగ్‌)గా, ఫార్మా కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌గా వై నవీన్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన ను డీసీఏ జేడీగా డీసీఏ డైరెక్టర్‌ ప్రీతిమీనా నియమించారు. ప్రస్తుత జేడీ వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఫార్మసీ పీహెచ్‌డీ పూర్తిచేసిన నవీన్‌కుమార్‌ తొమ్మిదేండ్ల క్రితం డీసీఏలో చేరి జూనియర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారిగా పనిచేశారు. 

 నీటి పారుదలశాఖలో అధికారుల బదిలీలు

నీటి పారుదలశాఖలో పలువురు అధికారులను బదిలీచేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (అడ్మిన్‌) ఆర్‌ గోవర్ధనాచారి ఈ నెల 31న ఉద్యోగ విరమణ పొందనుండటంతో ఆయన స్థానంలో కేఆర్‌ చందర్‌రావును నియమించారు. చందర్‌రావు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సత్యవర్ధన్‌ను నియమించారు. ఐఎస్‌ అండ్‌ డబ్ల్యూఆర్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఎస్‌ నరిసింహారావు ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జెడ్‌ శ్రీనివాసరావును బదిలీచేశారు.