మరోసారి వివాదంలో వీ.కే సింగ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

మరోసారి వివాదంలో వీ.కే సింగ్

పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీ.కే సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు వీ.కే సింగ్. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్న వీ.కే సింగ్ గతంలో పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా తాను పదోన్నతికి పనికిరానా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు తెలంగాణ ఐపీఎస్ ఫైర్ బ్రాండ్ వీ.కే సింగ్.

జైళ్ల శాఖ డీజీ గా ఉన్నప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీ.కే సింగ్ ను ఆయన వ్యాఖ్యల వల్లే, ఆయన తీరు వల్లే ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా ఆయనను నియమించింది ప్రభుత్వం. పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా కూడా వీ.కే సింగ్ పోలీస్ అకాడమీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని,నేషనల్ పోలీస్ అకాడమీ కూడా అదే పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.