తహసిల్దార్ కి బీజేపీ నాయకుల వినతిపత్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

తహసిల్దార్ కి బీజేపీ నాయకుల వినతిపత్రం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ, రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని లక్ష రూపాయల వరకు రైతు ఋణాలను మాఫీ చేసి కొత్త ఋణాలను ఇచ్చుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బడంగ్ పేట్ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో  బాలాపూర్ మండల తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారో, అదే ప్రాతిపదికన ప్రస్తుతం కొత్తగా అర్హులైన రైతులతో పాటు అందరికీ గత రెండు సీజన్ లను కలుపుకుని మొత్తం ఎకరానికి రూ. 5000 ల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు రూ. 1,00,000 వరకు ఋణ మాఫీ చేస్తామని చెప్పి 18 నెలలు కావస్తున్నా, మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.