నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై పీడీ యాక్టు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై పీడీ యాక్టు : వరంగల్ పోలీస్ కమిషనరేట్


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను నియంత్రించి రైతులకు మేలు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునందుకోని సెంట్రల్ డివిజన్ పరిధిలోని
ఎల్కతుర్తి సర్కిల్ పోలీసుల అధ్వర్యంలో బుధవారం రైతులు నకిలీ విత్తనాలను గుర్తించాల్సిన అంశాలను వివరిస్తూ రూపొందించిన ఫ్లెక్సీని వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల నియంత్రణ కోసం ఎల్కతుర్తి సర్కిల్ పోలీసులు స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించే విధంగా రూపొందించబడిన ఈ ఫ్లెక్సీలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తద్వారా రైతులకు
ప్రత్యక్షంగా మేలు చేరుకూర్చినవారం ఆవుతామన్నారు. అదే విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ విధమైన ప్రచారంతో పాటు, అవగాహన సదస్సులను నిర్వహించాల్సిందిగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు అధేశించడం జరుగుతుందన్నారు.

Post Top Ad