శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ / జాతీయం ) : కరోనా వల్ల దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో వలస కార్మికులు, విద్యార్ధులు వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. దీంతో వారికి రిలీఫ్ ఇచ్చేలా కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. వలస కార్మికులను బస్సులలో తరలించేందుకు కేంద్ర సర్కార్ ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ నడిపే ప్రత్యేక రైళ్ల ద్వారా లసకూలీలు,విద్యార్ధులు,యాత్రికులు,పర్యాటకులను సొంతూళ్లకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలను హోంశాఖ జారీ చేసింది. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం రైల్వే శాఖ నోడల్ అధికారులను నియమించనుంది. రైళ్ల టికెట్లు సామాజిక దూరం ఇతర రక్షణ చర్యలకు సంబంధించి రైల్వే శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు.
Post Top Ad
Saturday, May 02, 2020
వలస కార్మికులకు శుభవార్త...
Admin Details
Subha Telangana News