ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 06, 2020

ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ


శుభ తెలంగాణ (06,ఏప్రిల్,2020 - ఆలూరు ) : ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ అన్నారు. ఆలూరు గ్రామంలో ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీ డబ్బులు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగితెలుసుకున్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఆమెతోపాటు వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచ్ విజయ లక్ష్మీ, ఎంపీటీసీలు యాదమ్మ, నరేంద్ర చారి, ఎంపీడీవో హరీశ్ కుమార్, ఉప సర్పంచ్ వెంకటేష్, నాయకులు మరి రమణారెడ్డి, నర్సింహులు తదితరులు ఉన్నారు.

Post Top Ad