కరోనా జాగ్రత్తలు లేకుండానే ప్రాజెక్టు ప్రారంభమా..? కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుబట్టిన టీపిసీసీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

కరోనా జాగ్రత్తలు లేకుండానే ప్రాజెక్టు ప్రారంభమా..? కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుబట్టిన టీపిసీసీ..

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొండ పోచమ్మ ప్రాజెక్టు ప్రారంబోత్సవ సందర్బంగా అనుసరించిన విధానాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరోనా క్లిష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలికి ఒదిలేసినట్టు సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహరించారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శన సందర్బంగా ముఖ్యమంత్రి సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఇక ప్రజలు ఎలా పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు టీపీసిసి నేతలు. ప్రజలకు ముఖ్యమంత్రి ఆదర్శప్రాయంగా ఉండాలని టీ పిసిసి కోశాధికారి, గుడూరు నారాయణ రెడ్డి హితవు పలికారు.
కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తున్నా పరీక్షలకోసం ఇంతవరకూ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఎందుకివ్వడంలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా శుక్రవారం ముఖ్యమంత్రి 2000 మందితో కోండపోచమ్మకు వెల్లారని, కనీసం మొఖానికి మాస్కు కూడా పెట్టుకోలేదని నిలదీసారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు కరోనా పై ఏలాంటి సందేశం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత వరకు ప్రత్యేకత ఉన్న ఎపిడిమాలజిస్టునే నియమించలేదని టీ పిసిసి కోశాధికారి, గుడూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు.