రోబోలతో కరోనా పరీక్షలు... బెంగళూరులో ప్రయోగాత్మకంగా పరిశీలన - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

రోబోలతో కరోనా పరీక్షలు... బెంగళూరులో ప్రయోగాత్మకంగా పరిశీలన

శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 -జాతీయం / బెంగుళూర్ ) : కరోనా స్క్రీనింగ్ పరీక్షలో మనుషులు పాల్గొంటే.. వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించిన బెంగళూరులోని ఓ ఆస్పత్రి గత 2 వారాలుగా స్కీనింగ్ పరీక్షలను రోబోలతో నిర్వర్తిస్తున్నాయి. ఆస్పత్రికి అనుమానితులు రాగానే ముందుగా ఏమేం లక్షణాలున్నాయో అడిగి ఓ రోబో థర్మల్ స్కీనింగ్ చేస్తుంది. కరోనా లక్షణాలు కాస్త కనిపించినా  వెంటనే రెండో రోబో దగ్గరకు వెళ్లాలి. రెండో రోబోపై ఉన్న తెర ద్వారా వ్యక్తి నేరుగా వైద్యులతో మాట్లాడతారు. ఫలితంగా వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. ఇలా ఇప్పటికే దాదాపుగా 3 వేల మందికి రోబోలు ఈ  విధంగా పరీక్షలు చేసినట్లు.. ఇన్వెంట్ సంస్థలో భాగస్వామ్యం వహించిన వరంగల్ నివాసి భరత్ పేర్కొన్నారు. వరంగల్ కిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భరత్ రోబో తయారీ అంకుర సంస్థ ఇన్వెంటోను మరో ఇద్దరితో కలసి ప్రారంభించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన గ్లోబెల్  సమ్మిట్ మీట్ లో మిత్ర రోబో ప్రధాని మోదీ, ఇవాంకాతో పాటు  అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే.

Post Top Ad