మైనారిటీ కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

మైనారిటీ కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ

మల్కాజ్ గిరి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ సందర్భంగా మైనారిటీ కుటుంబాలకు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రంజాన్ కిట్ మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు
ఇంటి వద్దనే తమ ర్థనలు జరుపుకోవాలని, కరోనా
మహమ్మారి వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కావునా ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కరోనా
నియంత్రణ చర్యల వల్ల నేడు వ్యాధి వ్యాప్తి అదుపులో ఉందని, మన అందరం ప్రభుత్వం సూచించిన విధంగా నడుచుకుంటూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad