కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఆర్ఎస్ పార్టీసీనియర్ నేత మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఆర్ఎస్ పార్టీసీనియర్ నేత మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి


శుభ తెలంగాణ (02 , ఏప్రిల్ , 2020) : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్వే నెంబరు 63 బై 26 నుండి 63 39 వరకు గల ప్రభుత్వ భుమిలో కొంతమంది నాయకులు యధేచ్ఛగా తప్పుడు డాక్యుమెంట్ లను సృష్టించి ప్లాట్లు చేసి విక్రయాలు చేస్తున్నారని.. దినిని  కజ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి డిమాండ్ చేశారు, శుక్రవారం నాడు బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్  పార్టీ నేతలతో కలిసి అన్యాక్రాంతం అయిన భూములను పరిశీలించారు.
  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న ప్రాంతంలో ఏలాంటి అనుమతులు లేకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా పరిశ్రమలు ఏలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సర్వే నంబర్ 63 బై 26, నుండి 63 39, కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కొంతమంది నాయకులు ఆక్రమిస్తున్నచర్యలు ఎందుకు తీసుకోవడం లేదో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.