రైల్వే లో ప్రజా రవాణా రేపటి నుండే మొదలు : ఇవాళ్టి నుండే టికెట్ల బుకింగ్లు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 11, 2020

రైల్వే లో ప్రజా రవాణా రేపటి నుండే మొదలు : ఇవాళ్టి నుండే టికెట్ల బుకింగ్లు ప్రారంభం


శుభ తెలంగాణ (11,మే ,2020) - జాతీయం : మే 17 వరకూ ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వే శాఖ నిర్ణయం మార్చుకుంది. ఈ నెల 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు వెళ్తాయి. వీటికి ఈనెల 11 (నేడే) సాయంత్రం 4 గంటల నుంచి IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పరిస్థితిని బట్టీ, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దాన్ని బట్టీ... దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్లను నడుపుతామని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం దేశంలో 20వేల రైలు బోగీలను... కరోనా వైరస్ బాధితుల ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చారు. రోజూ వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక్ రైళ్లు నడుపుతున్నారు. - స్పెషల్ ట్రైన్లకు టికెట్ బుకింగ్ IRCTC ద్వారా మాత్రమే ఉంటుంది.- మే 11 సాయంత్రం 4 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు - రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు అమ్మరు. ప్లాట్‌ఫాం టికెట్లు కూడా అమ్మరు. - టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణికులు... గంట ముందే స్టేషన్‌కి రావాలి.- స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులకు థెర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు జరుపుతారు. - ప్రయాణికులు ఏం చెయ్యాలో, చెయ్యకూడదో టికెట్లపై రాసి ఉంటుంది. తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. - ప్రయాణికులు తమ మొబైళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య సేతు (Arogya Setu App) యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి. - ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేశాక, లొకేషన్, బ్లూ టూత్ ఆప్షన్ కచ్చితంగా ఆన్ (on)లో ఉంచాలి. - ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. - కన్‌ఫాం టికెట్ ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. - కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. - కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే ట్రైన్ ఎక్కనిస్తారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad