కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టును ప్రారంభించిన నేపథ్యంలో కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ఓవైసీ ట్విటర్లో స్పందించారు. 'కొండపోచమ్మ సాగర్ గొప్ప ముందడుగు. జలాశయం ద్వారా రైతులకు సాగునీరు, గృహాలకు మంచినీరు అందుతాయి.' అని ఎంపీ ట్వీట్ చేశారు.
కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ నుంచి ఈ రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్‌కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.