కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ఇటలీ : మరో మూడు నెలలలో అందుబాటులోకి .. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ఇటలీ : మరో మూడు నెలలలో అందుబాటులోకి ..


అంతర్జాతీయం :  ప్రపంచ వ్యాప్తంగా కరోనా (COVID-19) తన ప్రభావాన్ని ఇంకా చూపుతూనే ఉంది.ఇటలీ ప్రభుత్వం (Italy Government) దీనిని యుద్ధప్రాతిపదికన అరికట్టేందుకు శాయశ్శక్తులా చేసిన ప్రయత్నం సఫలమై వారు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ''ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ (Corona Vaccine)ను అభివృద్ధి చేసినట్టు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌కు ఇటలీ వ్యాక్సిన్ కనిపెట్టిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ప్రపంచం అంతా ఇటలీవ వైపు చూసింది. ఇటలీ చేసిన ప్రకటన అందరినీలో ఆసక్తిని రేకెత్తించింది. ఇటలీకి చెందిన టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ మానవులపై పనిచేయగలిగిన వ్యాక్సిన్ కనిపెట్టాం అంటోంది. మరి నిజంగా మనుషులపై కూడా ప్రయోగాలు చేశారా? అన్న ప్రశ్న తలెత్తింది. దీనికి ఆ సంస్థ ఏం చెప్పిందంటే. ఎలుకలపై దీనిని ప్రయోగించామని, అది మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ వచ్చే మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు టకీస్ సీఈవో లుయిగి ఆరిసిచియో (Luigi Aurisicchio). మరి మనుషులపై ప్రయోగం చేయకుండానే వ్యాక్సిన్ వచ్చేసినట్టు చెప్పడం కరెక్టేనా అన్నది ప్రపంచం వేస్తున్న ప్రశ్న. వ్యాక్సిన్ ప్రయోగంలో కీలకమనది క్లినికల్ ట్రయల్స్. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది. మరి వారికంటే ఆలస్యంగా మీరు (coronavirus) క్లినిక్ ట్రయల్స్ మొదలుపెడుతున్నారు. ఎందుకంత కాన్పిడెన్స్ అన్న ప్రశ్నకు .. ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని టకీస్ సీఈవో సమాధానం ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటే. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో ఒక్క డోస్ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. దీన్ని బట్టి కరోనా వైరస్ మానవ కణాలకు సోకకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని గుర్తించామన్నారు. పైగా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇదే పెద్ద ముండుగు అన్నారు.

Post Top Ad