లాక్ డౌన్ వేల న్యాయవాదులను ఆదుకోండి : కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

లాక్ డౌన్ వేల న్యాయవాదులను ఆదుకోండి : కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్


శుభ తెలంగాణ (02 , ఏప్రిల్ , 2020) : కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బార్ కౌన్సిల్ లో నమోదై, అవసరం ఉన్నటువంటి న్యాయవాదులను తెలంగాణ బార్ కౌన్సిల్  ఆదుకోవాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. లాక్ నుండి 2019 బ్యాచ్ ల న్యాయవాదులకు బార్ కౌన్సిల్ రూ. 3500 ఇవ్వాలని తీర్మానం చేసిందని అందుకు బార్ కౌన్సిల్  కు ధన్యవాదములు తెలిపారు. ఈ డబ్బులు 4, 5 రోజుల్లో దరఖాస్తు చేసుకొని అర్హులైన న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. 2015 కంటే ముందు కూడా బార్ కౌన్సిల్ లో నమోదై ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారిని కూడా ఇదే విదంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని కరీంనగర్ బార్ తీర్మానం మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ను ప్రత్యేకంగా కోరినట్లు అధ్యక్షులు పీవీ రాజై కుమార్ మీడియాకు తెలిపారు. తన విజ్ఞప్తి పై బార్ కౌన్సిల్ సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.