ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ తో దీనగాధను చెప్పుకున్న వలసకూలీలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ తో దీనగాధను చెప్పుకున్న వలసకూలీలు..

ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపాది చూపించే అంశం దగ్గర నుండి దూరప్రాంతాలకు చేరుకునే క్రమంలో వలస కూలీలను ఆదుకునే అంశం వరకూ పకడ్బంధీగా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ముందు చూపు లేకుండా విధించిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల లక్షలాది వలస కార్మకుల జీవనం మృగ్యంగా మారిందని, వారందరిని స్వస్థాలకు చేర్చే బృహత్కర కార్యక్రమాన్ని బుజాన వేసుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా తెలంగాణలో ప్రాజెక్టుల సంరక్షణ కూడా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని, అందుకు తగ్గట్టుగా టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వ్యూహ రచన జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వేగంగా పావులు కదుపుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కరోనా వైరస్ మహమ్మారి వల్ల విధించిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల సమస్యల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పట్ల కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. గాంధీభవన్లో వలస కార్మికులతో మమేకమయిన పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పదివేల రూపాయలు వలస కార్మికులకు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు ఉత్తంకుమార్ రెడ్డి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు కాంగ్రెస్ నేతలు.