మంత్రులిద్దరు ఒకే వాహనంలో - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

మంత్రులిద్దరు ఒకే వాహనంలో

గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఒకే వేదికను పంచుకోవడానికి కూడా విముఖత చూపే మంత్రులిద్దరు ఒకే వాహనంలో కలిసి ప్రయాణించడం
జిల్లాలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య సయోధ్య కుదిరిందా, విభేదాలు సర్దుకున్నాయా, పార్టీ అధినేత వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారా, లేక వారే సర్దుబాటు చేసుకున్నారా? అంటూ టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
మంత్రులు ఈటల రాజేందర్ , గంగుల కమ లాకర్ గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిమంత్రులైన తర్వాత కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. మంత్రులుగా ఒకే వేదిక మీద కలిసి పాల్గొన్న సందర్భాలు కూడా తక్కువే. ఏమైందో
ఏమో కానీ మంత్రులిద్దరు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఒకే వాహనంలో ప్రయాణించడం అటు పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. అందరిలోనూ ఆసక్తి రేపింది. .