ముస్లిం సోదరులకు పాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

ముస్లిం సోదరులకు పాలు పంపిణీ

ముస్లిం సోదర సోదరిమణులకు పవిత్రమైన పండుగ రంజాన్ ని పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు వై.యస్.రెడ్డి ఏనుగు సంగీత రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అవుషాపూర్ గ్రామంలో ఘట్కేసర్ మండల ఎంపీపీ, ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి... గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరీ మచ్చేందర్ రెడ్డి ద్వారా పాలు పంపిణీ చేయించడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ... అల్లాహ్ ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని.. లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో ఉన్నవారికి వై.యస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా తమ వంతు కృషిగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గూడ ఉప సర్పంచ్ మాయా నరేష్,
వార్డు మెంబర్ డిబి రవి నాయక్, వెంకటేష్, నాయకులు జిల్లాల రాజశేఖర్ రెడ్డి, గడిల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.