తెలంగాణ రైతులకి భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

తెలంగాణ రైతులకి భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్

శుభ తెలంగాణ (19,మే ,2020) : నియంత్రిత పద్దతిలో వ్యవసాయానికి రైతులు సహకారించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇష్టమొచ్చిన పంట వేసి ఆగమయ్యే బదులు.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేసి లాభాలు పొందాలన్నారు. పత్తి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రాజెక్ట్ కింద,బోర్ల కింద కూడా పత్తిని సాగుచేయాలని చెప్పారు. గతేడాది రెండు పంటలు కలిపి 1కోటి 23 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని.. ఈసారి మరో 10లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగవచ్చునని చెప్పారు. నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుందని.. దాని ప్రకారమే రైతులు పంటలు వేయాలని చెప్పారు. వర్షాకాలంలో మక్క పంట వద్దని చెప్పారు. యాసంగిలో మక్క పంట పండిస్తే దిగుబడి పెరిగి లాభం ఎక్కువగా ఉంటుందన్నారు. మక్కకు బదులు వానాకాలంలో కందిని సాగు చేస్తే ప్రభుత్వమే మద్దతు ధరతో వాటిని కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

Post Top Ad