మల్కాజిగిరి పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి : భారీ మొత్తంలో నగదు స్వాధీనం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

మల్కాజిగిరి పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి : భారీ మొత్తంలో నగదు స్వాధీనం

శుభ తెలంగాణ (20,మే ,2020) : ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో మౌలాలిలోని ఓ పేకాట క్లబ్ లో జవహర్ నగర్ కార్పొరేటర్ పేకాట ఆడుతూ మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇతనితో పాటు బిలిగౌలికర్ శివాజీ, శిలా సాగర కిరణ్ గౌడ్, కొచానా రాజు, పాల నటి, రమేష్, గంన్నం రాజేష్ కన్నా నాయుడు, అలపురం భాస్కర్ రెడ్డి, పోల్ రాజు ఉన్నారు. వీరి వద్ద నుండి నుండి 1,25,520 రూపాయలు, 7 సెల్ ఫోన్లు, 14 ప్లేయింగ్ కార్డుల సెట్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరిని మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు తరలించగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీవిధించగా చర్లపల్లి జైలుకు తరలించారు.Post Top Ad