వలస కార్మికులకు భోజనం వడ్డించిన టి.ఆర్.ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

వలస కార్మికులకు భోజనం వడ్డించిన టి.ఆర్.ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి


శుభ తెలంగాణ (20,మే ,2020) : టి.ఆర్.ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కండ్లకోయ చెక్ పోస్ట్ వద్ద వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించారు. అక్కడి ఏర్పాట్లును ఉన్నతాధికారులతో మాట్లాడి బస్ మరియు ట్రైన్ ల ద్వారా వివిధ రాష్ట్రాలకు పంపిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా భోజనం వడ్డించి వివిధ సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్న తీరు యావత్ దేశాన్ని ఆకర్షించిందని, ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా నేడు వ్యాధి వ్యాప్తి నియంత్రణలో ఉందని అన్నారు.


Post Top Ad