పోలీసు శాఖలో కరోనా గుబులు.. పెరుగుతున్న కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

పోలీసు శాఖలో కరోనా గుబులు.. పెరుగుతున్న కేసులు

తెలంగాణ పోలీసు శాఖలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్‌ను అమల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న పోలీసు సిబ్బంది కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో.. పోలీసులకు ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నాయి. దీంతో నగరంలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం మరో ముగ్గురు పోలీసుకుల కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. గాంధీ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు ఇన్ఫెక్షన్ సోకింది. నగరంలో ఇప్పటి వరకూ 15 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని సమాచారం.

కరోనా వైరస్ ఒక పోలీసు నుంచి మరో పోలీసుకు సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారు విధులుకు రావొద్దని సిబ్బందికి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల కామన్ బాత్‌రూంలను మూసేస్తున్నారు.

ఇంతకు ముందు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని సిబ్బందిలోనే కరోనాను గుర్తించగా.. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ కేసులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వాహనాలను ఆపిన సమయంలో పోలీసులు అతి దగ్గర నుంచి వారితో మాట్లాడాల్సి రావడం కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతోంది. దీంతో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.