తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు, ప్రతిపక్ష ఎంఐఎం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 24, 2020

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు, ప్రతిపక్ష ఎంఐఎం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు, ప్రతిపక్ష ఎంఐఎం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అయిన సుకన్య కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేని ఆమె ఆరోపించారు. శంకుస్థాపన సందర్భంగా ఎవరు ముందు కొబ్బరికాయ కొట్టాలనే అంశంపై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నించడంతో ఆమె కూడా అదే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ, సీఐ కూడా ఆయనకు సహకరించారని ఆరోపించారు. ఎంపీపీ సుకన్య ఫిర్యాదుతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల మీద కూడా కేసు నమోదైంది. తనతో దురుసుగా ప్రవర్తించారంటూ భాజపా నాయకురాలు బంగారు శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేయగా, బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తనను ఎమ్మెల్యే బలాలా కించపరిచారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.