మద్యం షాపుల ముందు మందు బాబుల జాతర.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

మద్యం షాపుల ముందు మందు బాబుల జాతర....


శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - జాతీయం ) : కరోనా ప్రభావంతో గత 40 రోజులుగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని బంద్ అయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3లో భాగంగా భారీ సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం షాపుల ముందు మందు బాబులు బారులు కట్టారు. కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. చత్తీస్ ఘడ్ లోని రాజ్ నంద్ గా లో సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్ షాప్ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు.

Post Top Ad