నీరు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన : పోల్కం అవినాష్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 26, 2020

నీరు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన : పోల్కం అవినాష్....

శుభ తెలంగాణ న్యూస్  (26మే20) మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి లోని నెరెడ్‌మెట్ పరిసరాల్లో  పోల్కం అవినాష్  ఆధ్వర్యంలో ఉపాధి కోల్పోయిన  నిరుపేదలకు, భవన నిర్మాణ కార్మికులుకు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి సుమారు150 మందికి పైగా కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు పోల్కం అవినాష్ మాట్లాడుతూ.... కరోనా వైరస్ మహమ్మారి  కారణంగా గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించిన నేపథ్యంలో ఎంతో మంది కార్మికులు ఉపాధి  కోల్పోయారని.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.ఈ కష్ట సమయంలో మానవత్వంతో   ప్రతి ఒక్కరినీ ఆదుకునే బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో  దిలేష్ కుమార్, 
హరీష్ వారణాసి, అనిరుధ్ ఠాకూర్, వంషి కృష్ణ, 
రాము,మధుసూధన్ రెడ్డి,నవీన్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.. 

 మరిన్ని చిత్రాలు: