శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ / జాతీయం ) : కరోనా వేళ వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యులు అవమానాలు ఎదుర్కొంటుండగా మరి కొన్ని చోట్ల ఘన స్వాగతాలు అందుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ విజయశ్రీ రెండు వారాలుగా ఇంటికి దూరంగా ఉండి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంది. 2 వారాల తర్వాత విజయశ్రీ ఇంటికి రావడంతో ఆమె ఉండే అపార్ట్ మెంట్ వాసులు హర్షధ్వానాలతో ఆమెకు వెల్ కం పలికారు. దీంతో విజయశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Post Top Ad
Saturday, May 02, 2020
వైద్యురాలికి ఘన స్వాగతం : నెట్టింట వైరల్
Admin Details
Subha Telangana News