భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం


శుభ తెలంగాణ న్యూస్ (21, మే, 2020) , రంగారెడ్డి జిల్లా : దేశవ్యాప్తంగా కరోనా  మహమ్మారి  ని ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించిన నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ పిలుపు మేరకు "Feed The Needy" కార్యక్రమంలో భాగంగా  భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో లాక్ డౌన్  మొదలైనప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనీ జిల్లా లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ లో చేవెళ్ల కన్వీనర్ జంగారెడ్డి సహకారంతో అన్నదానం చేపట్టారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగులేటి సుధాకర్ రెడ్డి ,  మాజీ ఎమ్మెల్సీ బీజేపీ కోర్ కమిటీ మెంబర్ హాజరై భోజనం పంపిణీ చేశారు. గత 52  రోజులుగా దాదాపు 20,000మందికి అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... నిరుపేదలకు నిత్యావసర సరుకులు మొదలుకొని, శానిటేషన్ వర్కర్లకు,డాక్టర్లకు పోలీసులకు మాస్కులు,గ్లోవ్స్, శానిటైజర్, పంపిణీ చేశామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై విషయం చిమ్మడం సరైన ధోరణి కాదని రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలో అన్నింటిలోనూ కేంద్రం ప్రభుత్వ వాటా ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన  గుర్తు చేశారు.