జూనియర్ డాక్టర్ల ఆందోళన : పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

జూనియర్ డాక్టర్ల ఆందోళన : పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన

శుభ తెలంగాణ (08, మే , 2020 -తెలంగాణ ) : పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరి మెడికల్ కళాశాలలో ఆందోళన చేపట్టారు  ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక..... ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా.. ఫీజులు పెంచిందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్ లు పీజీ చేయడానికి మెరిట్ సాధించిన విద్యార్థులు సంవత్సరానికి చెల్లించవలసిన 3.5 లక్షల ఫీజును 7.5 లక్షలు చెల్లించాలన్న ప్రభుత్వ జి ఓ నంబర్ 20ని తక్షణమే  రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పిజి మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమై, కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవ్వ క ముందే ఫీజులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని  జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ప్రయివేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా ఫీజులు పెంచారని వారు ఆరోపణ చేసారు. ఇంత ఖరీదు పెట్టి చదివాక సేవాదృక్పదం పోయి దోచుకునే వ్యవస్థ   ఏర్పడుతుందన్నారు. 2017 లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి జడ్జిమెంట్ రాక ముందే, ఫీజులు ఎలా పెంచుతారు అంటూ వారు మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.

Post Top Ad