వికారాబాద్ నియోజకవర్గం లోని ధరూర్ మండల కేంద్రంలో ఎరువుల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

వికారాబాద్ నియోజకవర్గం లోని ధరూర్ మండల కేంద్రంలో ఎరువుల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్....

శుభతెలంగాణ న్యూస్ (19మే20): వికారాబాద్ జిల్లా  రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట - ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండలం లోని కేరెల్లి, హరిదాస్ పల్లి, చింతకుంట గ్రామాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) తరుపున ఏర్పాటు చేసిన ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని (యూరియా, ఫెర్టిలైసెర్స్ షాపులను) ప్రారంభించారు. తెలంగాణలో రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తూ దేశంనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని, రాష్ట్రంలో కరోనా వైరస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం 8,210 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని వికారాబాద్ MLA *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు అన్నారు.ఈ కార్యక్రమంలో ధారూర్ PACS చెర్మెన్ సత్యనారాయణ రెడ్డి గారు, హరిదాస్ పల్లి PACS ఛైర్మెన్ వెంకట్రెడ్డి గారు, ధారూర్ మండల పరిషత్ అద్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మీ హన్మంత్ రెడ్డి గారు, ZPTC శ్రీమతి సుజాత వెేణుగోపాల్ రెడ్డి గారు, రైతు సమన్వయ సమీతి మండల అధ్యక్షులు రాంరెడ్డి గారు, MPDO అమృత గారు, MRO భీమయ్య గారు, PACS వైస్ ఛెర్మెన్ రాజు నాయక్ గారు, పార్టీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ PACS చెర్మెన్ హన్మంత్ రెడ్డి గారు, TRS పార్టీ జనరల్ సెక్రెటరీ యూనిస్ గారు, వైస్ ఎంపిపి విజయ్ గారు, MPO గారు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad