అమెరికాలో తెలుగు వైద్యులకు దక్కిన అరుదైన గౌరవం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 10, 2020

అమెరికాలో తెలుగు వైద్యులకు దక్కిన అరుదైన గౌరవం


శుభ తెలంగాణ (10, ,మే , 2020) - అంతర్జాతీయం : అమెరికాలో మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని స్థానికులు కొవిడ్‌-19 బాధితులకు సేవలందిస్తున్న తెలుగు వైద్యులకు ధన్యవాదాలు తెలుపు తూ శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఏపీకి చెందిన నలుగురు డా క్టర్ల ఇళ్ల ముందు స్థానిక అమెరికన్లు కార్ల ర్యాలీ నిర్వహించి హారన్లు, చప్పట్లు, కార్టూన్ల ప్రదర్శనతో కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా సేవలందిస్తున్న తెలుగు వైద్యులు డాక్టర్‌ అనంత్‌, డాక్టర్‌ మధు, డాక్టర్‌ మల్లిక, డాక్టర్‌ మాధవిలకు అమెరికన్లు కృతజ్ఞతలు తెలిపారు.  

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad