ఆర్టీకి మరిన్ని సడలింపులు.. ఎంజీబీఎస్‌కు కూడా బస్సులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

ఆర్టీకి మరిన్ని సడలింపులు.. ఎంజీబీఎస్‌కు కూడా బస్సులు

లాక్ డౌన్ వేళ ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాక, ఇప్పటి వరకూ జిల్లాల బస్సులకు జేబీఎస్‌కు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై ఎంజీబీఎస్‌లో ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రగతి భవన్‌లో బుధవారం వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీపైనా చర్చించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో బస్సులను పునరుద్ధరించాక జరిగిన మార్పుపైనా చర్చించారు. ‘‘కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రి కర్ఫ్యూ వల్ల పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదు. దీంతో ఆర్టీసీకి ఆదాయం రావడం లేదు. ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్‌లో రోజుకు రూ.15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, ఇప్పుడు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వస్తోంది. ఆక్యుపెన్సీ కేవలం 39 శాతం మాత్రమే ఉంది. రాత్రి పూట విధించే కర్ఫ్యూ వల్లే ఎక్కువ నష్టపోతున్నాం. ఓ బస్సు బయలుదేరాక రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానానికి చేరుకోవడం సాధ్యం కాదు. ఎండాకాలం జనాలు రాత్రి ప్రయాణానికే మొగ్గు చూపుతారు.’’ అని అధికారులు కేసీఆర్‌కు వివరించారు.