తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షల గడువు తేదీ పొడిగింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 27, 2020

తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షల గడువు తేదీ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రవేశపరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీజీసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షలకు జూన్ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది.
ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం eamcet.tsche.ac.inను సంప్రదించవచ్చు.