వరంగల్ లో భారీగా పాన్ , గుట్కాల దందా ...పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 11, 2020

వరంగల్ లో భారీగా పాన్ , గుట్కాల దందా ...పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు


శుభ తెలంగాణ (11,మే ,2020) - తెలంగాణ :  పాన్ మసాలా ముసుగులో గుట్కాల తయారీ చేస్తూ విక్రయిస్తున్న వారిని వరంగల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా ఇంటినే అడ్డాగా చేసుకుని గుట్కాలను యంత్రాల సహాయంతో తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక దందాపై కూపీ లాగుతున్నారు . ఇక అతని వద్ద నుండి తయారీకి ఉపయోగించే నిషేధిత పొగాకు ఉత్పత్తులను , ముడి పదార్ధాలను, యంత్రాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. పాన్ మసాలా పేరుతోని గుట్కాలు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. వరంగల్ లోని శివ నగర్ లోని వల్లాల రాజమల్లు అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలము నుండి ఈ దందా సాగుతుందని గుర్తించిన పోలీసులు యా ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గుట్కాలు తయారీకి ఉపయోగించే కీమామ్, జర్ధా, పొగాకు, తదితర ముడి పదార్ధాలు వాడి గుట్కాలు తయారు చేస్తున్నాడని ఇంట్లో దొరికిన ముడి పదార్ధాల ద్వారా తెలిసింది. ఇక గుట్కాలు తయారీ తరువాత వాటిని పుప్పాల గుట్ట లోని ఒక ఇంటిని కిరాయి కి తీసుకొని ఆ ఇంటి లోపల ప్యాకింగ్ యంత్రం సహాయంతో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఈ రకంగా తయారైనటువంటి గుట్కాలు 21 పాన్ మసాలా, 999 పాన్ మసాలా, Kk పాన్ మసాలా పేరుతో నగరంలోని పాన్ షాపులలో, కిరాణా షాపుల్లో సప్లయ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా దందా చేస్తున్నారు . ఇదంతా గుర్తించిన పోలీసులు తయారు చేసినటువంటి గుట్కాలను, మరియు గుట్కాలు తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు . ఇక ఇతని ద్వారా దందా సాగించే వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post Top Ad