కేంద్ర ప్యాకెజీ ఉద్దీపన ప్యాకేజి కాదు .. అది డొల్ల పాకేజి ...మాకొద్దు ఆ ప్యాకేజి అని వ్యాఖ్యానించిన కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

కేంద్ర ప్యాకెజీ ఉద్దీపన ప్యాకేజి కాదు .. అది డొల్ల పాకేజి ...మాకొద్దు ఆ ప్యాకేజి అని వ్యాఖ్యానించిన కేసీఆర్


శుభ తెలంగాణ (19,మే ,2020) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వట్టి డొల్ల.. 100శాతం బోగస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సింగపూర్ నుంచి వెలువడే ఏసియన్ ఇన్‌సైట్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఇది వట్టి బోగస్ అని పేర్కొన్నట్టు తెలిపారు. అలాగే జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనమిక్ జర్నల్ కూడా ఇదో అంకెల గారడీ అని తేల్చినట్టు చెప్పారు. ఇదో దుర్మార్గమైన ప్యాకేజీ అని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. తాము అడిగింది,కోరింది ఇది కాదన్నారు.రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితుల్లో... రాష్ట్రాల చేతుల్లోకి నగదు వస్తే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేదన్నారు. కానీ కేంద్రం రాష్ట్రాలను బెగ్గర్స్‌లా భావించిందని విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చే పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిధిని పెంచి.. అందులోనూ దరిద్రపు కండిషన్స్ అన్నీ పెట్టారని అన్నారు. ఈ ప్యాకేజీ వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. కొత్తగా రూ.20వేల కోట్లు ఇస్తున్నట్టు చెప్పారని.. కానీ రాష్ట్రానికి ఇప్పటికే రూ.5వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.

Post Top Ad