పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 5వ వార్డులో రూ.67 లక్షలతో, సాయి బాలాజీ కాలనీలో రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో పట్టణాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. వేల కోట్లు కేటాయించి పట్టణాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి తెలిపారు. అలాగే దోమల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Post Top Ad
Sunday, May 31, 2020
పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
Admin Details
Subha Telangana News