కేపీహెచ్ బి కాలనీ నుండి సర్దార్ పటేల్ నుండి వసంత్ నగర్ కు లింక్ రోడ్డు ను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 06, 2020

కేపీహెచ్ బి కాలనీ నుండి సర్దార్ పటేల్ నుండి వసంత్ నగర్ కు లింక్ రోడ్డు ను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు


శుభ తెలంగాణ (06,ఏప్రిల్,2020 - కూకట్ పల్లి ) : కూకట్ పల్లి నియోజకవర్గం నిజాంపేట్ నుండి హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీలకు వెళ్లే వాహనాల రద్దీ తగ్గించడానికి కేపీహెచ్ బి కాలనీ నుండి సర్దార్ పటేల్ నుండి వసంత్ నగర్ కు లింక్ రోడ్డు నిర్మించడానికి అడ్డుగా ఉన్న స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్లు అసోసియేషన్ సభ్యులు కలిసి పరిశీలించారు. అక్కడి సభ్యులతో నిర్మాణాన్ని తొలగించకుండా, రోడ్డు నిర్మిస్తామని దీంతో ట్రాఫిక్ కొంతమేర తగ్గించవచ్చని మేయర్ బొంతు రామ్మోహన్ రావు తెలిపారు. హైటెక్ సిటీ నుండి మియాపూర్ వరకు ట్రాఫిక్ తగ్గించడానికి, గోకుల్ చౌరస్తా వద్ద 80 ఫీట్ రోడ్డును నిర్మిస్తే చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపిన మీదట బుధవారం నుండి పనులు ప్రారంభించాల్సిందిగా, అధికారులకు ఆదేశించారు. ఈ నిర్మాణం వలన చాలా ట్రాఫిక్ తగ్గుతుంది అని.. మూడు సంవత్సరాలుగా తను ఈ విషయంపై పోరాడుతున్నానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇప్పటికైనా రోడ్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని మేయర్ బొంతు రామ్మోహన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.


Post Top Ad