కాప్రా సర్కిల్ లో "GHMC చెత్త లారీల దారి మల్లింపు కై అధికారులకు వినతిపత్రం.... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

కాప్రా సర్కిల్ లో "GHMC చెత్త లారీల దారి మల్లింపు కై అధికారులకు వినతిపత్రం....

శుభ తెలంగాణ న్యూస్ (20మే20) మేడ్చల్ జిల్లా  కాప్రా సర్కిల్ లో "GHMC చెత్త లారీల దారి మల్లింపు " విషయమై అఖిలపక్షం నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎస్ సి డిపార్ట్మెంట్ కో ఆర్డినేటర్ శ్రీ పత్తి కుమార్ గారు,  కాప్రా, ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ల  కార్పొరేటర్లు శ్రీ స్వర్ణరాజ్ శివమణి  & శ్రీమతి పావని మణిపాల్ రెడ్డి ,లోక్ సత్తా రాష్ట్ర యువసత్తా అధ్యక్షులు శ్రీ బి శివరామ కృష్ణ ,టీడీపీ డివిజన్ 2 కార్యదర్శి శ్రీ రహీం, తెలుగు యువత నాయకులు శ్రీ సందీప్,బీజేపీ నాయకులు శ్రీ వికాస్ గుప్త, అశోక్, జమ్మిగడ్డ, అరుల్ కాలనీల యువకులు మరియు గాంధీనగర్ యూత్ అసోసియేషన్  తో కలిసి GHMC జోనల్ కమీషనర్ గారికి వినతిపత్రం అందించడం జరిగినది. 
అలాగే కుషాయిగూడ పోలీస్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ విజయ్ శ్రీనివాస్ కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. జోనల్ కమీషనర్ శ్రీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నాగారం-బండ్లగూడ - జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రోడ్డు మార్గం విస్తరణ పనులు జరుగుతుండగా 70% పూర్తవగా మరో 30% పనులు వారం పది రోజుల్లో పూర్తి చేసి ఆ మార్గం గుండానే చెత్త వాహనాలు నడిపిస్తామని హామీ ఇవ్వగా,  కార్పొరేటర్లు కూడా పదిరోజుల్లో చెత్తలారీలను పాతమార్గం గుండానే వెళ్ళేటట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చ్చారు. ఈ సందర్బంగా అఖిలపక్షం అధ్యక్షులు శ్రీ పత్తి కుమార్ గారు మాట్లాడుతూ - చెత్తలారీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయాయని, అలాగే దుర్వాసన వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్ఛే అవకాశాలున్నాయని,
ఈ సమస్యపై కార్పొరేటర్లు తమతో కలిసి అధికారుల దృష్టికి తేవడం  మరియు సమస్య పరిష్కరణకు GHMC జోనల్ కమీషనర్ గారు, కార్పొరేటర్లు హామీలివ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో TRS నాయకులు మణిపాల్ రెడ్డిగారు, వార్డ్ మెంబర్ పవన్, జమ్మిగడ్డ యువకులు  ధర్మ శ్రీను,  కిషోర్, అరుల్ కాలనీ యువకులు  మణికంఠ, ఏలేష్, గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి సత్యనారాయణ,  సభ్యులు శ్రీహరి,  మోహన్, రాజు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad