రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, వైరస్ నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా నియంత్రణతో పాటు, లాక్ డౌన్, రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూ తదితర అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. మరో నాలుగు రోజుల్లో లాక్ డౌన్ 4 గడువు ముగియనున్నందున సడలింపుల అంశంపైనా సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో మెట్రో రైలు, సిటీ బస్సు సర్వీసులకు లాక్ డౌన్ సడలింపు వర్తింపజేయాలా వద్ద అన్న అంశంపై కూడా ఈ సమీక్షలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రవాణా శాఖ మంత్రి, అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరై సమాలోచనలు జరపనున్నారు.
Post Top Ad
Wednesday, May 27, 2020
KCR ఉన్నతస్థాయి సమీక్ష.. మెట్రో రైలు, సిటీ బస్‌లకు సడలింపు?
Admin Details
Subha Telangana News